మావోయిస్టులతో సంబంధాల కేసు... న్యాయవాదులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ - NIA raids in uppal
18:27 June 23
దేవేంద్ర, స్వప్న, శిల్పలను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
రాష్ట్రంలోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు జరిపింది. నర్సింగ్ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్న ఎన్ఐఏ అధికారులు.. హైదరాబాద్ ఉప్పల్‌తో పాటు మెదక్ జిల్లా చేగుంట, మేడిపల్లి పర్వతాపూర్‌లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేశారు.
ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్‌లో ఎన్‌ఐఏ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో డిజిటల్ సామగ్రి, మావో భావజాల సామగ్రి స్వాధీనం చేసుకుంది. మావోయిస్టు అనుబంధ సంస్థతో దేవేంద్ర, స్వప్న, శిల్పకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. చైతన్య మహిళా సంఘం ముగ్గురూ పనిచేసినట్లు ఎన్ఐఏకు ఆధారాలు లభించాయి. యువత నక్సల్స్‌లో చేరేలా ముగ్గురు ప్రోత్సహించారని ఎన్ఐఏ తేల్చింది. పెదబయలులో ఈ ఏడాది జనవరి 3న ముగ్గురిపై కేసు నమోదు కాగా... ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. గురువారం ఎన్‌ఐఏ వీరిని అదుపులోకి తీసుకుంది.
ఇదీ చూడండి: ఎన్ఐఏ అదుపులో లాయర్లు శిల్ప, దేవేంద్ర.. రాధ మిస్సింగ్ కేసుపై విచారణ
TAGGED:
NIA raids at hyderabad