తెలంగాణ

telangana

ETV Bharat / crime

నవీపేట్​లో అమ్మవారి విగ్రహాల ధ్వంసం - telangana crime news

నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండల కేంద్రంలో దేవతా విగ్రహాల ధ్వంసం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహాలను పగలగొట్టారు.

Destruction of idols of Goddess in Navipet
నవీపేట్​లో అమ్మవారి విగ్రహాల ధ్వంసం

By

Published : Mar 9, 2021, 12:35 PM IST

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు.. దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఘటనలో మహాలక్ష్మి ఆలయంలోని చిలుకమ్మ, మంగమ్మ విగ్రహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దేవతామూర్తుల చేతులు, గద్దె భాగం ధ్వంసమయ్యాయి.

మంగళవారం ఉదయం గుడి తెరిచేందుకు వచ్చిన పూజారి.. విగ్రహాల చేతులు పగిలి ఉండటం చూసి ఆలయ కమిటీ, పోలీసులకు సమాచారం అందించారు. నవీపేట్ ఎస్సై యాకుబ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి:ఆ వార్తతో చిగురించిన ఆశలు.. సాయం కోసం ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details