వేగంగా వచ్చి అదుపు తప్పిన లారీ ట్యాంకర్ ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం గుంటూరుపల్లిలో చోటుచేసుకుంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఇంటిపైకి దూసుకెళ్లిన ట్యాంకర్ లారీ - ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ లారీ అదుపు తప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
lorry tanker crashed into a house
కాయా కష్టం చేసుకుని కట్టుకున్న ఇల్లు.. ప్రమాదంలో కుప్పకూలడంతో బాధితులు లబోదిబోమన్నారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:750 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత