తెలంగాణ

telangana

ETV Bharat / crime

చేపల మార్కెట్​లో తూనికలు, కొలతల శాఖ దాడులు - inspections in fish market

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం చేపల మార్కెట్​లో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతోన్న పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

inspections in fish market
inspections in fish market

By

Published : Jun 20, 2021, 3:16 PM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం చేపల మార్కెట్​లో తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మార్కెట్​లో కాటాల పనితీరును పరిశీలించారు. నిర్ణీత బరువుకంటే తక్కువ బరువు నమోదైన.. కిలో రాళ్లను స్వాధీనం చేసుకుని, దుకాణదారులపై కేసులు నమోదు చేశారు.

వ్యాపారుల మోసాలను అరికట్టేందుకే ఆకస్మిక దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details