మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న వంగూరి ప్రవీణ్‌కుమార్ ఆలియాస్ కుమార్(32) ఇంటి పక్కన ఉంటున్న ఇంటర్ విద్యార్థినికి(17) మాయమాలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. బాలికకు కాఫీలో మత్తుమందు కలిపిచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి అయింది. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో 2015లో నిందితుడిపై ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Rape case : బాలికపై లైంగికదాడి.. నిందితుడికి జీవిత ఖైదు
ఇంటర్ విద్యార్థినికి కాఫీలో మత్తుమందు కలిపిచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం జీవితఖైదుతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించించి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో 2015లో నమోదైన ఫిర్యాదుపై సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సురేశ్.. నిందితుడికి పొక్సో చట్టం కింద శిక్షవిధిస్తూ తీర్పు ఇచ్చారు.
మేడ్చల్ జిల్లా వార్తలు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అప్పటి సీఐ టి.రవీందర్ నిందితుడిని న్యాయ స్థానంలో హాజరుపరిచారు. అనంతరం బదిలీపై వచ్చిన సీఐ బి.ప్రకాశ్ ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సురేశ్... నిందితుడికి పొక్సో చట్టం కింద శిక్షవిధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఇదీ చూడండి:Accident: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి