నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలోని మద్యం షాపులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని కొల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. దుకాణం షట్టర్లు పగులగొట్టి క్యాష్ కౌంటర్లో రూ. 10లక్షలను ఫుల్జాల మల్లయ్య అలియాస్ చిన్న ఎల్లయ్య (50) చోరీ చేసినట్లు వెల్లడించారు. ఆయన నుంచి రూ.7 లక్షలు నగదు, 4 స్మార్ట్ ఫోన్లు, స్వైపింగ్ మిషన్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మద్యం దుకాణంలో చోరీ.. నిందితుడి అరెస్టు - నాగర్కర్నూల్ జిల్లా తాజా వార్తలు
మద్యం దుకాణంలో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మద్యం దుకాణంలో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
రూ. 2లక్షలకు పైగా జల్సాలకు ఖర్చు చేసినట్లు చెప్పారు. చిన్న మల్లయ్య దాదాపు 100కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 2న జైలు నుంచి విడుదలయ్యాడని... అప్పటి నుంచి నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: కేటీఆర్కు వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీకాంత్ కృతజ్ఞతలు