తెలంగాణ

telangana

ETV Bharat / crime

అప్పులు భారమై రైతు ఆత్మహత్య - ఆదిలాబాద్‌ జిల్లా క్రైం వార్తలు

ఓ రైతు తనకున్న భూమికి తోడు మరికొంత పొలం కౌలుకు తీసుకున్నాడు. పంట పండించాడు. కానీ ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో అప్పులు గుదిబండగా మారి.. తన చేనులోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Debt ridden farmer suicide, adilabad district crime news
అప్పులు భారమై రైతు ఆత్మహత్య

By

Published : Apr 7, 2021, 8:36 AM IST

అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం కప్పర్లకు చెందిన చుక్కబొట్ల లస్మన్న(59) తనకున్న ఆరెకరాలతోపాటు.. మరో అయిదు ఎకరాలు రూ.85 వేలకు కౌలుకు తీసుకున్నాడు. అందులో పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.2 లక్షల రుణం, బయట మరో రూ.3 లక్షలు అప్పు చేశాడు.

వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం చేనుకు వెళ్లి పురుగు మందు తాగాడు. ఆయనకు భార్య కమల, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శిరీష తెలిపారు.

ఇదీ చూడండి :రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details