తెలంగాణ

telangana

ETV Bharat / crime

వీడిన మర్డర్​ మిస్టరీ.. తాగిన మైకంలో నిజం చెప్పేశాడు! - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు

Student Murder Mystery In AP : క్రికెట్‌ ఆడే సమయంలో ఓ విద్యార్థి, ముగ్గురు భవన నిర్మాణ కూలీల మధ్య పరిచయం ఏర్పడింది. అది కొంతకాలం బాగానే సాగింది. ఓరోజు వారి మధ్య జరిగిన గొడవలో ఆ విద్యార్థి హత్యకు గురయ్యారు. మృతదేహం కనిపించలేదు. అప్పటినుంచి ఆ కుర్రాడి ఆచూకీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత ఇటీవల.. హంతకుల్లో ఒకరు మద్యం మత్తులో ఈ విషయం చెప్పడంతో నిజం బయటపడింది.

Murder Mystery in east godavari
Murder Mystery in east godavari

By

Published : Apr 6, 2022, 10:25 AM IST

Student Murder Mystery In AP : ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన పి.శ్రీహర్ష(17) 2018లో వేలివెన్నులోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. అదే ఏడాది దీపావళికి దారవరంలోని తాతయ్య శ్యామ్‌సన్‌ ఇంటికి వచ్చాడు. అంతకుముందు నుంచే క్రికెట్‌లో స్నేహితులైన నిర్మాణ కూలీలు షేక్‌ రషీద్, ఆదిత్య, మునీంద్రలతో కలిసి నిడదవోలు జూనియర్‌ కళాశాలకు ఆడుకొనేందుకు వెళ్లారు. వీరి మధ్య గొడవ జరగడం వల్ల శ్రీహర్షను ఆ ముగ్గురూ.. మెడకు తాడు బిగించి హతమార్చారు. శవం కనిపించకుండా కళాశాలలోని వినియోగంలో లేని సెప్టిక్‌ ట్యాంక్‌లో దాచిపెట్టారు. ఏడాది తర్వాత 2019లో విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీసి, నిడదవోలు రైల్వే గేటు సమీపంలోని కాలువలో పడేశారు. 2018లోనే శ్రీహర్ష అదృశ్యంపై తండ్రి రత్నకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేశారు.

అప్పటినుంచి అదో మిస్టరీలా మిగిలిపోయింది. కాగా ఇటీవల రషీద్‌ తాగిన మైకంలో తనతో జాగ్రత్తగా ఉండాలని.. తానో హత్య చేసినట్లు చెప్పి మిత్రులను హెచ్చరించాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు రషీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి బయటపడింది. రషీద్‌ను అరెస్టు చేశారు. ఆదిత్య, మునీంద్ర పరారీలో ఉన్నారు. డీఎస్పీ శ్రీనాథ్‌ నిడదవోలు కళాశాలలోని సెప్టిక్‌ ట్యాంక్‌లో మరికొన్ని ఎముకలను గుర్తించారు. ఎస్సై రమేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి:Suicide: ప్రేమ విఫలమై మెట్రోస్టేషన్‌ నుంచి దూకి యువతి ఆత్మహత్య..!

ABOUT THE AUTHOR

...view details