తెలంగాణ

telangana

ETV Bharat / crime

గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం - గోదావరిలో గల్లంతైన మృతదేహం లభ్యం

శుక్రవారం గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నిర్మల్ జిల్లా సోన్​ మండల కేంద్రంలోని నాయుడివాడ కాలనీకి చెందిన రాజుల భీమేశ్​ (40) స్నానానికి వెళ్లి నది ప్రవాహంలో గల్లంతయ్యాడు.

Dead body was found in Godavari yesterday a person missing in river in nirmal district
గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

By

Published : Feb 13, 2021, 4:43 PM IST

స్నానానికి వెళ్లి గోదావరిలో గల్లంతైన ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నిర్మల్ జిల్లా సోన్​ మండల కేంద్రంలోని నాయుడివాడ కాలనీకి చెందిన రాజుల భీమేశ్​ (40)గా గుర్తించినట్లు స్థానిక ఎస్సై అసిఫ్​ తెలిపారు.

శుక్రవారం స్నానానికి వెళ్లిన అతను గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. కుటుంబసభ్యులు ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం జాలర్లతో నదిలో గాలించగా మృతదేహం లభించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చూడండి :ప్రాజెక్టుల్లో అవినీతిపై కేంద్ర మంత్రికి బండి సంజయ్​ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details