అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఇందిరానగర్ ఫేజ్ 2లోని ఓ ఇంట్లోని చెక్కపెట్టెలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం - హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం
హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించాడు. మృతుడు రెండేళ్ల క్రితం ఆ ఇంట్లో అద్దెకు దిగినట్లు స్థానికులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం
మృతుడు రెండేళ్ల క్రితం ఆ ఇంట్లో అద్దెకు దిగాడని స్థానికులు తెలిపారు. ఇంటి యజమాని అద్దెకు వచ్చిన వ్యక్తికి తాళాలు అప్పగించి ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కేవలం పుర్రె, కాళ్లుచేతుల ఎముకలు మాత్రమే లభించడంతో వాటిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:హాలియాలో కేసీఆర్ పర్యటన.. భాజపా నేతల ముందస్తు అరెస్టు