ఎమ్మెల్సీ కారులో మృతదేహం.. అసలేం జరిగింది? - ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో మృతదేహం కలకలం
08:01 May 20
ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో మృతదేహం కలకలం
ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యంది గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తనతో పాటు డ్రైవర్‌ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఉదయ్ బాబు సమాచారమిచ్చారు.
శుక్రవారం తెల్లవారుజామున 2గంటలకు తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్లుగా ఎమ్మెల్సీ వద్ద సుబ్రహ్మణ్యం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. డ్రైవర్‌ను హత్య చేశారంటూ ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులతో మాట్లాడారు.
ఇదీ చూడండి