సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలోని బోయిన్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ వ్యక్తి మృతదేహం చెరువులో తేలియాడుతూ ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పరిశీలించారు.
బోయిన్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - telangana varthalu
అల్వాల్ పీఎస్ పరిధిలోని బోయిన్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని అల్వాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బోయిన్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని అల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.