డంపింగ్ యార్డు వద్ద ఓ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని గమనించిన గ్రామపంచాయతీ కార్మికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
డంపింగ్ యార్డు వద్ద మృతదేహం లభ్యం.. - భద్రాచలం డంపింగ్ యార్డులో మృతదేహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దారుణం జరిగింది. స్థానిక డంపింగ్ యార్డులో అనుమానాస్పదస్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని గమనించిన గ్రామపంచాయతీ కార్మికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
భద్రాచలం డంపింగ్ యార్డులో మృతదేహం లభ్యం
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతని వద్ద ఉన్న ఆధార్ కార్డు సహాయంతో ఏపీలోని విశాఖకు చెందిన బర్ల శ్రీనివాసరావుగా గుర్తించారు. మృతుడు ఖాకీ చొక్కా వేసుకోవడంతో ఆటో డ్రైవర్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఇంటి నుంచి చెప్పకుండా వచ్చినట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.