మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారం పురపాలక పరిధిలో నివసించే దొబ్బాల సత్తయ్య(65) అనే వ్యక్తి గతేడాది కురిసిన భారీ వర్షాలకు వాగులో గల్లంతయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసేందుకు ఎంత గాలించినా లభించలేదు.
DEAD BODY FOUND: ఏడాది తర్వాత లభ్యమైన మృతదేహం.. అసలేమైందంటే? - medchal district latest news
గతేడాది కురిసిన భారీ వర్షాలకు గల్లంతైన ఓ వ్యక్తి మృతదేహం దాదాపు సంవత్సరం తర్వాత లభ్యమైంది. సోమవారం ముళ్లపొదల్లో చిక్కుకున్న శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీశారు.

ఏడాది తర్వాత లభ్యమైన మృతదేహం..
తాజాగా నాగారం పురపాలిక పరిధిలోని వాగులో ముళ్లపొదల్లో చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకుని శవాన్ని వెలికితీశారు. మృతుడు దొబ్బాల సత్తయ్యగా గుర్తించారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.