మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల పసికందును బీరన్న దేవాలయం సమీపంలోని ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు విసిరేసి వెళ్లారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా ముళ్లపొదల్లో తలలేని ఆడశిశువు మృతదేహం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ముళ్ల పొదల్లో తలలేని పసికందు మృతదేహం లభ్యం - telangana varthalu
అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు ముళ్ల పొదల్లో తలలేని మృతదేహంగా ప్రత్యక్షమైంది. మంచిర్యాల జిల్లాలోని సీతారాంపల్లి గ్రామంలో మూడు రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో విసిరేసి వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ముళ్ల పొదల్లో తలలేని పసికందు మృతదేహం లభ్యం
పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. జంతువులు మృతదేహాన్ని పీక్కు తినడంతోనే తలభాగం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. కన్న బంధం తీపి లేకుండా శిశువును ముళ్ల పొదల్లో ఎలా పడేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముళ్ల పొదల్లో తలలేని పసికందు మృతదేహం లభ్యం
ఇదీ చదవండి: రాడ్తో తలపై కొట్టి.. మర్మాంగాన్ని కోసేసి వ్యక్తి దారుణ హత్య