వేగంగా వచ్చిన ఓ డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారి 44పై జరిగింది.
డీసీఎం బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు - రహదారిపై ప్రమాదం
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారి 44పై.. ఓ డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
Dcm overturned
డీసీఎం ఆయిల్ డబ్బాల లోడుతో కర్నూలు వైపు నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. డ్రైవర్.. లోపలే ఇరుక్కుపోవడంతో అతడిని బయటికి తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదంలో డ్రైవర్ రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో వాహనాన్ని తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఇదీ చదవండి:ఆటలోనే ముగిసిన చిన్నారి ఆయుష్షు