అంత్యక్రియలకు వెళ్తూ... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి - డీసీఎం ద్విచక్రవాహనం ఢీ
12:38 June 09
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident in Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం శివారులోని స్టాన్ ఫోర్డ్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వాహనం స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందిన దండెబోయిన నర్సింహ, భార్య రాజ్యలక్ష్మి, వదిన జంగమ్మ స్కూటీ మీద చౌదరిపల్లి గ్రామంలో ఓ చావుకు హాజరుకావటానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో హన్మాపురం శివారులో జగదేవ్పూర్ నుంచి భువనగిరి వైపు ఎదురుగా వస్తున్న డీసీఎం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొనడంతో... ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి:మైనర్ అక్కాచెల్లెళ్లతో శారీరక సంబంధం.. ఇద్దరు యువకులపై పోక్సో కేసు