తెలంగాణ

telangana

ETV Bharat / crime

పిల్లలతో సహా విషం తాగిన తల్లి.. కుమార్తె మృతి - deth in odalarevu

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా ఓడలరేవులో విషాదం నెలకొంది. కుమారుడు, కుమార్తెతో సహా తల్లి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కుమార్తె మృతిచెందగా... తల్లీ, కుమారుల పరిస్థితి విషమంగా ఉంది.

daughter died in a suicide attempt at odalarevu east godavari district
పిల్లలతో సహా విషం తాగిన తల్లి

By

Published : Apr 8, 2021, 3:45 AM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా.. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో విషాదం నెలకొంది. మాధవి అనే మహిళ తన కుమారుడు లోహిత్, కుమార్తె హరిణిలకు విషమిచ్చి, ఆమె కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

గమనించిన స్థానికులు... బాధితులను అమలాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కుమార్తె హరిణి మృతి చెందింది. తల్లి మాధవి, కుమారుడు లోహిత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మాధవి భర్త సతీశ్​ వేధింపులు తట్టుకోలేక మాధవి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి:భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details