Daughter beats own mother: వయోభారంతో బాధపడుతున్న వృద్ధురాలిపై సొంత కూతురు పింఛన్ డబ్బులు కోసం దాడి చేసిన ఘటన విస్మయానికి గురిచేస్తోంది. స్థానికుల కథనం ప్రకారం నాగర్ కర్నూల్‌కు చెందిన చంద్రమ్మ(70) అనే వృద్ధురాలు జిల్లా కేంద్రంలో తన కూతురుతో కలిసి జీవనం సాగిస్తోంది. వయసు మీద పడటంతో ఏ పని చేయలేక ప్రభుత్వ పింఛన్ మీదనే ఆధారపడి జీవిస్తోంది.
పింఛన్ డబ్బులు కోసం అమ్మపై దాడి .. జుట్టు పట్టుకొని నడివీధిలో తిప్పుతూ వీరంగం - Pension money
పింఛన్ డబ్బులు కోసం వృద్ధురాలిపై దాడి జరిగిన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటనలో ఆ వృద్ధురాలిని అమానవీయంగా కొట్టింది కన్నకూతురే. అడిగిన వెంటనే కూతురుకు పింఛను డబ్బులు ఇవ్వకపోవడమే ఆ తల్లి చేసిన నేరం.
ఇటీవల వచ్చిన పింఛను డబ్బులను తనకు ఇవ్వాలని కూతురు అడగగా.. వృద్ధురాలు నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కూతురు నడిరోడ్డుపై తల్లిపై దాడికి పాల్పడింది. వీధిలోకి లాక్కొచ్చి చావు దెబ్బలు కొట్టింది. చుట్టుపక్కల వారు ఎంత వారించిన వినకుండా అడ్డువచ్చిన వారిని దుర్భాషలతో తిట్టింది. స్థానికులు వీడియోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న సరే ఏమాత్రం భయం లేకుండా వారిని సైతం కొట్టడానికి సిద్దమైంది. విస్మయం గురి చేస్తున్న ఈ ఘటన జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో జరిగింది. దాడికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇవీ చదవండి: