Daughter Attack on Father: ప్రియుడి మాయలో పడి ఓ బాలిక కన్న తండ్రిపై చాకుతో దాడికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరంలో చోటు చేసుకుంది. నాలుగో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కుమారుడు, కుమార్తె (17) ఉన్నారు. కుమార్తె ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
ఆమెకు నగరంలోనే ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్న బాలుడి (17)తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారడంతో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాలిక తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను బాలుడికి ఇచ్చింది. విషయం తండ్రికి తెలిసి కుమార్తెను.. నిలదీయడంతో కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె ప్రియుడికి చెప్పింది.