కోపం(angry).. ఈ రెండక్షరాలు ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాయి. తనకు ఎదురు తిరుగుతోందన్న కారణంతో కన్న కూతురిని ఓ తల్లి దారుణంగా హత్య(murder) చేసింది. దీన్ని తట్టుకోలేని కుమారుడు క్షణికావేశంలో తల్లిని కత్తితో పొడిచి హతమార్చాడు. కడప(kadapa)లో జరిగిన ఈ ఘటన స్థానికులకే గాక.. ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురి చేసింది.
కడప నకాష్ వీధికి చెందిన షేక్ హుస్సేన్, షేక్ ఖుర్షీదాలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి షేక్ అలీమా, షేక్ జమీర్ అనే పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగుతుండడం వల్ల కొంతకాలంగా ఖుర్షీదా .. భర్త నుంచి విడిపోయి వేరుగా నివసిస్తోంది. అప్పుడప్పుడు వారి ఇంటికి భర్త హుస్సేన్ వస్తుండేవాడు.