ONLINE GAME HARASSAMENT: ఆన్‌లైన్ రుణ యాప్‌లపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా... వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. యాప్ నిర్వాహకుల వేధింపులతో ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది బలవ్వగా... తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అత్తాపూర్ పాండురంగ నగర్‌లో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
లోన్‌యాప్స్ వేధింపులకు మరో యువకుడు బలి - datthatreya commits suicide with loan apps harassment in rajendrangar
ONLINE GAME HARASSAMENT: ఆన్‌లైన్ రుణయాప్‌ల ఆగడాలకు రాష్ట్రంలో మరో ప్రాణం బలైంది. తీసుకున్న అప్పు కట్టేందుకు యాప్‌లో రుణం.. అదీ కట్టలేక క్రెడిట్ కార్డుల వినియోగం.... అయినా అప్పుల వేధింపులు ఆగకపోవడం వల్ల ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన కుటుంబాన్ని ఛిన్నాభిన్న చేసి... తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
Loan apps
దత్తాత్రేయ అనే యువకుడు ఆన్‌లైన్‌లో జూదానికి అలవాటై దాదాపు ఏడులక్షలు పోగొట్టుకున్నాడు. క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న అప్పు రెండు లోన్‌యాప్‌ల ద్వారా దాదాపు లక్షన్నర రుణం తీసుకున్నాడు. లోన్ కట్టడం లేదని రికవరీ ఏజెంట్లు పదేపదే అడగడంతో చెల్లించే స్థోమత లేక... సూసైడ్ నోట్ రాసి బలవన‌్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Loan apps: రుణయాప్‌ల వేధింపులు.. డబ్బు ఎరవేసి బాధితులకు చుక్కలు