తెలంగాణ

telangana

ETV Bharat / crime

Dharbanga blast: పాకిస్థాన్​ కేంద్రంగానే దర్భంగా పేలుడు జరిగినట్టు అనుమానం..! - nasir malik was accused in blast case

బిహార్​లోని దర్భంగా రైల్వేస్టేషన్​ పేలుళ్లకు సంబంధించిన దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఈ పేలుళ్లను పాకిస్థాన్​ కేంద్రంగా ప్లాన్​ చేసినట్టు ఎన్​ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు సంబంధించిన మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్టు అనుమానిస్తున్న అధికారులు.. పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Darbhanga blast took place in the center of Pakistan suspecting nia hyderabad
Darbhanga blast took place in the center of Pakistan suspecting nia hyderabad

By

Published : Jun 30, 2021, 7:45 PM IST

దర్భాంగా రైల్వేస్టేషన్​లో పేలుళ్లకు సంబంధించిన కుట్ర పాకిస్థాన్ కేంద్రంగా జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పేలుళ్ల విషయంలో హస్తం ఉందని అనుమానిస్తున్న పలువురిని హైదరాబాద్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో నసీర్​, ఇమ్రాన్​ అనబడే ఇద్దరు సోదరుల గురించి దర్యాప్తు చేయగా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రధాన అనుమానితునిగా ఉన్న నసీర్ మూడుసార్లు పాకిస్థాన్​కు వెళ్లొచ్చినట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది.

నకిలీ చిరునామాతో...

55 కిలోల బరువున్న చీరల పార్శిల్ మధ్యలో పేలుడు స్వభావం ఉన్న రసాయన సీసాను నిందితులు ఉంచారు. ఈ నెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో పార్శిల్​ను దర్బాంగాకు సుఫియాన్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాన్​కార్డు చూపించి పంపించారు. దర్బాంగాలో పార్శిల్ తీసుకునే వ్యక్తి పేరు కూడా సూఫియాన్ అనే రాసి ఉంచారు. చరవాణి నెంబర్ కూడా నకిలీదే ఇచ్చారు. 17న దర్బాంగాలో పార్శిల్​ను రైల్లోంచి తీసిన తర్వాత స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్​కు...

ఉత్తరప్రదేశ్​లోని ఖైరానాకు చెందిన నసీర్ రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్​కు వచ్చి ఆసీఫ్​నగర్​లో స్థిరపడ్డాడు. వస్త్ర వ్యాపారం చేస్తూ హైదరాబాద్​కు చెందిన యువతినే పెళ్లి చేసుకున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఏడాది క్రితం నసీర్ సోదరుడు ఇమ్రాన్ కూడా హైదరాబాద్​కు వచ్చి ఆసిఫ్​నగర్​లోనే మరో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే వీళ్లిద్దరూ... ఓ ఉగ్రవాది ఆదేశాలు పాటిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ప్లాన్​ చేసింది.. రైల్లోనా?.. విమానంలోనా..?

ఖైరానా ప్రాంతానికి చెందిన ఓ ఉగ్రవాది ప్రస్తుతం పాకిస్థాన్​లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. అతడి ఆదేశాల మేరకే నసీర్.. రసాయనాలతో పేలుడు జరపడానికి శిక్షణ కూడా పొందినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ విషయమై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. నసీర్​, ఇమ్రాన్​లతో పాటు మిగతా అనుమానితులు కూడా ఈ పేలుళ్ల కేసులో ఉన్నారా...? ఉంటే.. వారికి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి..? లాంటి కీలక అంశాలపై అధికారులు దృష్టి సారించారు.

రసాయన సీసాను పార్శిల్​లో పంపిన దాన్ని బట్టి రైల్లోనే పేలుడు జరపాలనున్నారా...? దర్బాంగా రైల్వేస్టేషన్ నుంచి ఆ పార్సిల్​ను విమానంలో తరలించి విమానంలో పేలుడు జరపాలనుకున్నారా...? అనే కోణంలోనూ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'నేను చెప్పినట్టు చేస్తారా... గన్నుకు పని చెప్పమంటారా..?'

ABOUT THE AUTHOR

...view details