సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జూపిటర్ కాలనీకి చెందిన సురేందర్ అనే డాన్స్ మాస్టర్.. అదే కాలనీలో అర్బన్ వరల్డ్ డాన్స్ అకాడమీ నడుపుతున్నాడు. తన వద్ద డాన్స్ నేర్చుకునేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించగా.. ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది.
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన డాన్స్ మాస్టర్ అరెస్ట్ - bowenpally news
ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన డాన్స్ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డాన్స్ మాస్టర్, డాన్స్ మాస్టర్ అరెస్ట్
ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. బోయిన్పల్లి పీఎస్‌లో డాన్స్ మాస్టర్ సురేందర్‌పై ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేందర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :సీడీకేసు: హైకోర్టుకు మహిళ తండ్రి