Accident News: పత్తి కూలీల ఆటో బోల్తా... పలువురికి తీవ్రగాయాలు - mahabubnagar district latest news
11:20 October 18
పత్తి కూలీల ఆటో బోల్తా
వాళ్లు రెండు పూటలు తినాలంటే... కూలీ పనికి వెళ్లాల్సిందే. పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే... రోజూ పనికి పోవాల్సిందే. రోజూలానే ఈరోజు కూడా కూలీ పనులకు ఆటోలో బయలు దేరారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం పేరూరు వద్దకు రాగానే... పత్తి కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూలీలు మదనపురం మండలం తిరునయ్యపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి: