తెలంగాణ

telangana

ETV Bharat / crime

హయత్​నగర్​లో రోజువారి కూలీ దారుణ హత్య - హయత్​నగర్​లో రోజువారి కూలీ దారుణ హత్య

హైదరాబాద్​ హయత్​నగర్​లో దారుణం జరిగింది. రోజువారి కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు... తలపై బండరాయితో మోది హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్య గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

daily labour murder in hayathnagar
labour murder

By

Published : Mar 26, 2021, 12:07 PM IST

హైదరాబాద్ హయత్​నగర్​లో రోజువారి కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురానికి చెందిన దొడ్డ మధుసూదన్ రెడ్డి(45)గా గుర్తించారు. కొన్నేళ్లుగా నగరంలోనే పెయింటర్​గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తెలియజేశారు. గుర్తుతెలియని దుండగలు మధుసూదన్ తలపై బండరాయితో మోది హత్య చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: భువనగిరిలో రైల్వేపట్టలాపై గుర్తు తెలియని మృతదేహం

ABOUT THE AUTHOR

...view details