నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌లో గురువారం మృతి చెందిన కార్మికుడు రాజు కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు ప్లాంట్ ముందు ధర్నాకు దిగారు. వీర్లపాలెం గ్రామానికి చెందిన బొమ్మనబోయిన రాజు... యాదాద్రి పవర్ ప్లాంట్‌లో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. గురువారం 5వ యూనిట్ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టటంతో రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి.
పవర్ ప్లాంట్ ప్రమాదంలో కూలీ మృతి.. బాధిత కుటుంబం ఆందోళన - యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ప్రమాదం
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్లాంట్ ముందు ధర్నాకు దిగారు. బాధితుల ఆందోళనలతో అక్కడ ఉద్రక్తత చోటుచేసుకుంది. అక్కడి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు
![పవర్ ప్లాంట్ ప్రమాదంలో కూలీ మృతి.. బాధిత కుటుంబం ఆందోళన daily labour died in accident in yadadri power plant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10507185-thumbnail-3x2-udriktha.jpg)
పవర్ ప్లాంట్‌లో ప్రమాదం.. దినసరి కూలీ మృతి
అతన్ని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్లాంట్‌లో పనిచేసే వ్యక్తి చనిపోతే ఇంతవరకు యాజమాన్యం పరామర్శించలేదని... మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ పవర్ ప్లాంట్ ముందు స్థానికులు ధర్నాకు దిగారు. గతంలో జరిగిన ప్రమాదాలకు యాజమాన్యం ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని స్థానికులు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
పవర్ ప్లాంట్‌లో ప్రమాదం.. దినసరి కూలీ మృతి
ఇదీ చదవండి:తాళికట్టి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Last Updated : Feb 5, 2021, 1:02 PM IST