Cylinder Blast in Fast Food Center : ఏపీ విజయనగరం జిల్లా రాజాంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో.. భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలకొండ రోడ్డులోని డోలపేట జంక్షన్ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లోని మూడు గ్యాస్ సిలిండర్లు పేలటంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించడంతో స్థానికులు.. అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరి ప్రాణాలకు నష్టం జరగలేదని.. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో మూడు గ్యాస్ సిలిండర్ల పేలుడు - ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
Cylinder Blast in Fast Food Center : ఏపీలోని విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. రాజాంలో పాలకొండ రోడ్డులోని డోలపేట జంక్షన్ వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగలేదని కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ యజమాని తెలిపారు.
Cylinder Blast in Fast Food Center