బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 అంబేడ్కర్ నగర్‌లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో ఇళ్లంతా పూర్తిగా మంటలంటుకుని... సామగ్రి మొత్తం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే తేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను నిలువరించేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.
సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం.. తప్పిన ప్రాణాపాయం - Exploded cylinder at Banjara Hills Road No. 11
ఓ ఇంట్లో సిలిండర్ పేలి సామాగ్రి మొత్తం కాలిబూడిదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.
సిలిండర్ పేలి దగ్ధమైన సామగ్రి .. తప్పిన ప్రాణాపాయం
సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బంజారాహిల్స్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని... మంటలను ఆర్పారు.
ఇదీ చదవండి:కంటైనర్-లారీ ఢీ.. వ్యక్తి సజీవదహనం