తెలంగాణ

telangana

ETV Bharat / crime

మిస్సైల్​లా పైఅంతస్తులోకి దూసుకెళ్లిన సిలిండర్​ - హైదరాబాద్ తాజా వార్తలు

Cylinder blast: సోడా తయారీకి ఉపయోగించే సిలిండర్లు అమ్ముతున్న దుకాణంలో సిలిండర్ లీకై పేలి పైఅంతస్తుకు మిస్సైల్​లా దూసుకెళ్లింది. ఈ ఘటన కూకట్​పల్లి భాగ్యనగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఇంట్లో వారు పక్క గదిలో ఉండటంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

cylinder blast
cylinder blast

By

Published : Dec 21, 2022, 5:50 PM IST

Cylinder blast: కూకట్​పల్లి, భాగ్యనగర్ కాలనీలోని స్వగృహ సోడా దుకాణంలో సిలిండర్లను విక్రయిస్తున్నారు. కాగా ఈరోజు ఉదయం సిలిండర్ లీకై పేలి పైఅంతస్తుకు స్లాబు నుంచి దూసుకెళ్లింది. పైఅంతస్తులోని గృహోపకరణాలు చెల్లాచెదురయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నవారు పక్క గదిలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. నిబంధనలకు విరుద్దంగా సిలిండర్లను విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తునారు.

మిస్సైల్​లా పైఅంతస్తులోకి దూసుకెళ్లిన సిలిండర్​

ABOUT THE AUTHOR

...view details