తెలంగాణ

telangana

ETV Bharat / crime

CYBER CRIME: నయా మోసం.. వేలల్లో బాధితులు, కంగుతిన్న పోలీసులు - పీవీ సోలార్‌ అప్లికేషన్స్‌ మోసం

రూ.10వేలు కడితే.. రోజుకు రూ.వేయి చొప్పున.. 150 రోజులకు రూ.1.5 లక్షలు తిరిగి చెల్లిస్తాం. అంటే.. 1.4 లక్షలు లాభమన్న మాట అంటూ ఐటీ కారిడార్‌(it corridor hyderabad) పరిధిలోని విద్యార్థులను నిండా ముంచేశారు. బాధితులు పదుల సంఖ్యలో ఉంటారని భావిస్తే.. వేలల్లో ఉండటంతో సైబరాబాద్‌ పోలీసులు కంగుతిన్నారు. రాయదుర్గం ఠాణాలో బాధితుడి(23) ఫిర్యాదుతో నెలరోజులుగా 'పీవీ సోలార్‌ అప్లికేషన్స్‌'(pv solar applications) పేరిట జరిగిన నయా మోసం తాజాగా వెలుగులోకొచ్చింది. పోలీసులు కేసు(ఎఫ్‌ఐఆర్‌ సంఖ్య: 625/2021) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

CYBER CRIME
CYBER CRIME

By

Published : Oct 20, 2021, 11:06 AM IST

గూగుల్‌ ప్లేస్టోర్‌లో యాప్‌..

'పీవీ సోలార్‌ అప్లికేషన్స్‌'(pv solar applications) పేరిట ఓ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. మొబైల్‌ నంబర్‌, ఖాతా వివరాలుంటే చాలూ.. ఎవరైనా ఇందులో సభ్యత్వం తీసుకోవచ్ఛు ఇందులో రూ.10వేల మొదలు రూ.5 లక్షల వరకు వివిధ కేటగిరీలున్నాయి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ అయ్యి మన స్థోమతను బట్టి కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. ఫోన్‌పే(phonepe), గూగుల్‌పే(Google Pay), పేటీఎం(Paytm) తదితర యాప్‌ల ద్వారా డబ్బులను చెల్లించాలి. ఆ తర్వాత పెట్టుబడికి అనుగుణంగా లాభాలు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలా మొదట్లో కొన్ని రోజులు అంతా బాగానే నడిచింది. ఆ నోటా.. ఈ నోటా చాలా మంది పెట్టుబడులు పెట్టారు. వీరిలో ఎక్కువగా ఐటీ కారిడార్‌లోని ప్రైవేట్‌ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఎలా బయటపడిందంటే..

కొన్ని రోజులుగా యాప్‌ పనిచేయడం లేదు. ఓపెన్‌ చేయగానే ఒకటి, రెండు నిమిషాల్లోనే 'ఎర్రర్‌' అని వచ్చి క్లోజ్‌ అవుతుండటంతో బాధితులకు అనుమానమొచ్చి ఆరా తీయగా అసలు మోసం బయటపడింది. ఎవరికీ చిక్కకుండా యాప్‌ నిర్వాహకులు చాలా తెలివిగా వ్యవహరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కంపెనీగా నమ్మించారు. ఎక్కడా కార్యాలయం పేరు, చిరునామాను పేర్కొనలేదు. ప్రత్యేకంగా కస్టమర్‌ కేర్‌ అంటూ లేదు. సందేహాలుంటే యాప్‌లో ఉండే వాట్సాప్‌ లింక్‌ను క్లిక్‌ చేసి అడిగితే నివృత్తి చేసేవారు. బ్యాంక్‌ ఖాతాల ఆధారంగా నిందితుల జాడను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details