తెలంగాణ

telangana

ETV Bharat / crime

cyber crime: లైటనింగ్ పవర్ యాప్.. డబ్బులు పెడితే మటాష్

ఈజీ మనీ ఆశ చూపి ఓ మహిళ దగ్గర నుంచి రూ.12 లక్షలు కాజేశారు దుండగులు. 'లైటనింగ్ పవర్ యాప్ డౌన్లోడ్' చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేయాలని సదరు మహిళకు ఫోన్ చేశారు. మొదట కొంత డబ్బు తిరిగిచ్చి... ఆశజూపారు. డబ్బులొస్తున్నాయన్న ఆశతో మహిళ మళ్లీ సుమారు 13 లక్షలు పంపింది. ఆ తరువాత సైబర్ నేరగాళ్లు ఫోన్ స్విఛాప్ చేయడంతో లబోదిబోమంది.

By

Published : May 28, 2021, 12:03 PM IST

హైదరాబాద్ లో సైబర్ క్రైమ్
Cyber crime at Hyderabad

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో ఓ మహిళ డబ్బులు పెట్టి మోసపోయింది. హైదరాబాద్ బాలానగర్​కు చెందిన లక్ష్మీ అనే మహిళకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను పంపే లింక్ ద్వారా ‘లైటనింగ్ పవర్ యాప్’ డౌన్లోడ్ చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేయాలని కోరాడు. నమ్మిన లక్ష్మీ మొదట కొంత నగదు ఇన్వెస్ట్ చేయగా.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చాయి.

అనంతరం ఆ వ్యక్తి మళ్లీ మహిళకు ఫోన్ చేసి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందన్నాడు. ఈజీ మనీ ఆశతో లక్ష్మీ బంధువుల వద్ద అప్పు చేసి మరీ రూ.12.91 లక్షలు ఆ వ్యక్తి పంపిన యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసింది. అనంతరం ఆమె ఫోన్ చేస్తే నిందితుడు స్పందించకపోవడంతో లబోదిబోమంది. మోసపోయానని గ్రహించి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నైజీరియా సైబర్ నేరస్థుల పనిగా భావించి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details