‘‘నమస్కారం.. నాపేరు లావణ్య.. మా పూర్వీకులు భారతీయులే...మా కుటుంబం యార్క్‌షైర్‌లో స్థిరపడింది... అమ్మమ్మ మాత్రమే ఉన్నారు.. కొన్నేళ్ల నుంచి బహుళజాతి సంస్థ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను.. నా తల్లిదండ్రుల చివరి కోరిక తెలుగురాష్ట్రాల్లో ఉంటున్న వారిని పెళ్లి చేసుకోవాలని... మీకు ఇష్టమైతే మాట్లాడండి’’
సికింద్రాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఫేస్‌బుక్ ద్వారా వచ్చిన ప్రేమపూర్వక అభ్యర్థన. కొద్దిరోజులు ఇద్దరూ వాట్సాప్ నంబర్ ద్వారా మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం ఉంగరం కొనేందుకు 85వేల పౌండ్లు పంపుతున్నాను తీసుకోండి అంటూ నెలరోజుల క్రితం లావణ్య చెప్పింది. మరుసటి రోజు దిల్లీలోని కొరియర్ సంస్థ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఫోన్ వచ్చింది. చెక్కును మార్చుకోవాలంటే రుసుం చెల్లించాలని కోరగా... సరేనన్నాడు. కస్టమ్స్, ఆదాయపన్ను, సుంకాల పేరుతో రూ.95లక్షలు కట్టాడు. తర్వాత అవతలి వ్యక్తులు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు.’’
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను లావణ్య పేరుతో మోసం చేసింది విదేశాల్లో ఉంటున్న యువతి కాదు. దిల్లీలోని వసంత్ విహార్‌లో ఉంటున్న సైబర్ నేరస్థురాలు(Cybercriminals). ఈమే కాదు... మరికొంతమంది ఫేస్‌బుక్ ద్వారా వ్యాపారులు, వృత్తినిపుణులను పరిచయం చేసుకుని ప్రేమాయణం సాగిస్తున్నారు. పెళ్లిచేసుకుందామంటూ ప్రతిపాదిస్తున్నారు. బాధితులు అంగీకరించిన వెంటనే నిశ్చితార్థం కానుకలు, గిఫ్ట్‌చెక్కుల పేరుతో మోసాలు చేసి రూ.లక్షలు కాజేస్తున్నారు.
వారు నిజాయతీపరులంట..