తెలంగాణ

telangana

ETV Bharat / crime

Facebook fake account: ఫేస్​బుక్​లో ప్రొఫెసర్ అసభ్యకర పోస్టులు.. చివరికి... - తెలంగాణ నేర వార్తలు

కొవిడ్​ సమయంలో కళాశాల యాజమాన్యం జీతాలు చెల్లించలేదని ఓ ప్రొఫెసర్... కళశాల యాజమానిపై ఎలాగైనా కక్ష సాధించాలనుకున్నాడు.ఫేస్​బుక్​లో నకిలీ ​ఖాతా తెరిచి అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు( a Professor who posted obscene in Facebook fake account). కళాశాల ఛైర్మన్​కు చెడ్డపేరు తెద్దామనుకుని.. అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యాడు.

Cyber Crime
Cyber Crime

By

Published : Sep 23, 2021, 1:21 PM IST

చెడపకురా చెడేవు అన్న సూక్తికి ఈ ప్రొఫెసర్ చేసిన పనే ఓ ఉదాహరణ. జీతం చెల్లించలేదన్న కోపంతో కళాశాల ఛైర్మన్​పై కక్ష సాధించేందుకు చేసిన కుట్ర వికటించి కటకటాలపాలయ్యాడో విద్యావంతుడు. ఈ ఘటన రాచకొండ సైబర్​క్రైం స్టేషన్​ పరిధిలో జరిగింది.

ఫేస్​బుక్​లో నకిలీ ఖాతా తెరిచి అసభ్యకర పోస్టులు పెడుతున్న ఓ ప్రొఫెసర్​ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు( a Professor who posted obscene in Facebook fake account). తమిళనాడుకు చెందిన సిరాజుద్దీన్(39).. ఘట్కేసర్ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. గతంలో హయత్​నగర్(hayath nagar kuntluru) పరిధి కుంట్లూరులోని ఓ కళాశాలలో పనిచేసేవాడు.

గతంలో పనిచేసిన సమయంలో కొవిడ్​ కారణంగా యాజమాన్యం జీతాలు చెల్లించలేదు. జీతాల కోసం ఎన్నిసార్లు అడిగినా కళాశాల యాజమాన్యం స్పందించకపోవడం వల్ల ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. సదరు కళాశాల ఛైర్మన్​ పేరుతో ఫేస్​బుక్​ నకిలీ ఖాతా తెరిచి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. తన పేరుపై ఉన్న ఫేక్​ ఖాతాను గుర్తించిన కళాశాల ఛైర్మన్​ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:cyber crimes: గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతున్న ఆన్‌లైన్‌ నేరాలు

ABOUT THE AUTHOR

...view details