తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏటీఎం వద్ద కాల్పులు జరిపిన నిందితుడి విచారణ - తెలంగాణ వార్తలు

కూకట్‌పల్లి బ్యాంకు ఏటీఎం కేంద్రంలో కాల్పులు జరిపి.. నగదు దోచుకున్న కేసులో చిక్కిన దొపిడీ దొంగను సైబరాబాద్‌ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడ్డారో ప్రశ్నిస్తున్నారు.

firing
కూకట్​పల్లి కాల్పులు

By

Published : May 1, 2021, 5:25 PM IST

హైదరాబాద్​ కూకట్‌పల్లి బ్యాంకు ఏటీఎం కేంద్రంలో కాల్పులు జరిపి.. నగదు దోచుకున్న కేసులో చిక్కిన దోపిడీ దొంగను సైబరాబాద్‌ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడ్డారు, జంటనగరాలతో పాటు రాష్ట్రంలో ఈ తరహా దోపిడీలు ఏమైనా చేశారా, ద్విచక్ర వాహనాలు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు అనే కోణంలో విచారిస్తున్నారు.

నగరంలో వీరికి ఎవరు ఆశ్రయమిచ్చారు, ముఠాలో ఇద్దరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. త్రుటిలో తప్పించుకున్న మరో దోపిడీ దొంగ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై సైబరాబాద్‌ పోలీస్​ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:మంత్రి ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ సీఎంకు బదిలీ

ABOUT THE AUTHOR

...view details