తెలంగాణ గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ పేరుతో సైబర్ నేరగాళ్లు (Cyber scams) నకిలీ మెయిల్ తయారు చేశారు. ప్రొఫైల్ పేరు మాత్రం అసలైన దాని పేరుతోనే రూపొందించారు. ఆ మెయిల్‌తో క్రింది స్థాయి ఉద్యోగులకు... తాను మీటింగ్‌లో ఉన్నానని.. అత్యవసరంగా రూ.10 వేలు విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపాలని మెయిల్ చేశారు.
Cyber Crime: 'నేను మీటింగ్‌లో ఉన్నా.. అమెజాన్ గిఫ్ట్‌కూపన్ పంపండి' - భూగర్భ గనుల శాఖ అధికారుల పేరుతో సైబర్ మోసాలు
సైబర్ నేరగాళ్లు (Cyber scams) కొత్త తరహా మోసాలకు తెరలేపారు. సంస్థల వెబ్సైట్లో సీఈఓ, డైరెక్టర్ల పేరుతో నకిలీ మెయిల్ తయారు చేసి అమెజాన్ గిప్ట్ కూపన్ పేరుతో క్రింది స్థాయి ఉద్యోగులను మోసం చేస్తున్నారు.
హైదరాబాద్ నేర వార్తలు
నిజమే అనుకుని స్పందించిన నిజామాబాద్ గనుల శాఖ అధికారి గిఫ్ట్ కార్డ్ కొని వచ్చిన మెయిల్‌కే రిప్లై ఇచ్చారు. మరో ఇద్దరు కూడా ఇదే విధంగా పంపారు. విషయం తెలుసుకున్న గనుల శాఖ డైరెక్టర్ రోనాల్డ్ రోస్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: MURDER: దుర్భాషలాడుతున్నాడని తండ్రినే కడతేర్చాడు!