తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Crime: 'ఏడీ-షిక్తా' పేరిట ఎస్​ఎంఎస్​లు.. క్లిక్​ చేస్తే ఖాతా ఖల్లాస్ - 'ఏడీ-షిక్తా' పేరిట ఎస్​ఎంఎస్​లు

అమెజాన్‌లో పార్ట్‌టైం జాబ్​ అంటూ మెసేజ్​లు వస్తాయి... లింక్ పంపిస్తారు.. క్లిక్​ చేస్తే.. ఇక అంతే సంగతులు. డబ్బులు వచ్చినట్టే కనిపిస్తాయి.. విత్​డ్రా చేసుకునేందుకు యత్నిస్తే రావు. ఇలాంటి ఎస్‌ఎంఎస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ హరినాథ్‌ హెచ్చరిస్తున్నారు.

'ఏడీ-షిక్తా' పేరిట ఎస్​ఎంఎస్​లు.. క్లిక్​ చేస్తే ఖాతా ఖల్లాస్
Cyber Crime

By

Published : Aug 12, 2021, 8:42 AM IST

రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ కేటుగాళ్లు.. తాజాగా ‘అమెజాన్‌లో పార్ట్‌టైం’ ఉద్యోగాలిప్పిస్తామని పేర్కొంటూ ‘ఏడీ-షిక్తా’ పేరిట ఓ సందేశాన్ని పంపుతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని ‘తెలివి’గా వల విసురుతూ ఖాతాల్లోదంతా ఊడేస్తున్నారు. బాలాపూర్‌కు చెందిన యువకుడు(25) ఏకంగా రూ.7.90 లక్షలు పోగొట్టుకోగా, నాగోల్‌కు చెందిన విద్యార్థి(23) రూ.67,500 మోసపోయాడు.

టెలిగ్రాంలో సందేశం పంపితే... :

‘ఏడీ-షిక్తా’ పేరిట ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. ‘అమెజాన్‌ పార్ట్‌టైం ఉద్యోగంలో చేరితే రోజుకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు సంపాదించొచ్చు’ అనేది సారాంశం. అందులోనే కింద ఓ చరవాణి నంబరు ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులమని చెబితే వెంటనే ‘టెలిగ్రాం’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమంటారు. ఆ తర్వాత స్క్రీన్‌ షాట్‌ తీసి పంపితే.. ఒక నంబర్‌(టెలిగ్రాం) ఇస్తారు. ఆ నంబర్‌కు టెలిగ్రాంలో మెసేజ్‌ చేస్తే లింక్‌ పంపుతారు.

టాస్క్‌.. రీఛార్జ్‌.. :

టెలిగ్రాంలో పంపిన లింక్‌ను క్లిక్‌ చేయగానే ఓ వెబ్‌సైట్‌ తెరుచుకుంటుంది. ఇక్కడే వివిధ రకాల టాస్క్‌లుంటాయి. ఉదాహరణకు.. రూ.200 రీఛార్జ్‌ చేస్తే రూ.400 ఖాతాలో జమ చేస్తున్నారు. తర్వాత మరో టాస్క్‌కు రూ.1000తో రీఛార్జ్‌ చేయాలి. అప్పుడు రూ.1400 జమవుతాయి. ఇలా అప్పులు చేసి మరీ రీఛార్జ్‌ చేస్తున్నారు. వెబ్‌సైట్‌ ఖాతాలో దండిగా కమీషన్‌ వచ్చినట్లుగా చూపిస్తున్నారు. తీరా.. వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు యత్నిస్తే రావడంలేదు. సాంకేతిక సమస్యలని..ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయంటూ రకరకాల కారణాలు చెబుతూ మోసం చేస్తున్నారు. ఇలాంటి ఎస్‌ఎంఎస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ హరినాథ్‌ హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details