తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Crime case : సైబర్ చీటర్స్​కు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్ - హైదరాబాద్ వార్తలు

Cyber Crime case : సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లాట్ రెంట్ పేరిట రాజస్థాన్ భరత్​పూర్​కి చెందిన నిందితుడు సునీల్​... సైబర్ నేరస్థులకు సహకరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Cyber Crime case, hyderabad cyber police
సైబర్ చీటర్స్​కు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్

By

Published : Dec 10, 2021, 11:27 AM IST

Updated : Dec 10, 2021, 11:41 AM IST

Cyber Crime case : సైబర్ చీటర్స్​కు సహకరిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ భరత్​పూర్​కి చెందిన సునీల్ కుమార్... మ్యాజిక్ బ్రిక్స్, నో బ్రోకర్ యాప్​ల్లో ఫ్లాట్ రెంట్ తీసుకుంటామని... నమ్మించి మోసాలకు పాల్పడేవారికి సహకరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆర్మీ అధికారులమని... నమ్మించి ఫ్లాట్​రెంట్ తీసుకుంటామని నమ్మిస్తారని సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడు సునీల్ కుమార్

అడ్వాన్స్ డబ్బులు పంపిస్తామని చెప్పి డబ్బులు కాజేసి... అందులో 20శాతం తీసుకునేలా సైబర్ క్రిమినల్స్​తో సునీల్ డీల్ చేసుకున్నాడని వెల్లడించారు. బాధితుల అకౌంట్ల నుంచి వచ్చిన డబ్బును తన పీవోఎస్ మెషిన్ ద్వారా కాజేస్తున్నాడని వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు... సునీల్​ని అరెస్ట్ చేశారు. నిందితుడు వద్ద ఉన్న 8 ఏటీఎం కార్డులు, 2 మొబైల్ ఫోన్లు, 1 పీవోఎస్ మెషిన్, రూ.1.5 లక్షలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

అడ్డగిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు

Cyber Criminals : రాష్ట్రంలో జరిగిన పలు సైబర్‌ నేరాల సూత్రధారులు రాజస్థాన్‌లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు... వారిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు. భరత్‌పూర్ చేరకముందే పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారిని అడ్డగించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా బెదిరింపులకు దిగారు. నిందితులను గుర్తించేలోపే పోలీసులపై గ్రామస్థులు రాళ్లదాడి ప్రారంభించారు. చాకచక్యంగా బయటపడిన పోలీసులు మరుసటిరోజు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి తీసుకువచ్చేందుకు వెళ్తే అక్కడా అడ్డంకి ఏర్పడింది. ట్రాన్సిట్ వారెంట్ పై ఇక్కడకు తీసుకువచ్చేందుకు అనుమతి కోరగా అక్కడే రిమాండ్ విధిస్తామని న్యాయమూర్తి నుంచి సమాధానం వచ్చింది. స్థానిక పోలీసులు కూడా అటువైపే మొగ్గుచూపారు. ఇలాంటి సమస్యలు తెలంగాణ పోలీసులకు ఎదురవుతున్నాయి. వీళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియగానే స్థానిక ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి వారిని తప్పించేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నారు.

తేలికగా నిందితులు ఎస్కేప్

ఎలాగోలా కష్టపడి వారిని పట్టుకుని రాష్ట్రానికి తీసుకొస్తున్నా రోజుల వ్యవధిలోనే జైలు నుంచి బయటపడుతున్నారు. సైబర్‌ నేరస్థులు అరెస్టయ్యారని తెలియగానే వారిని ఎలా బయటకు తీసుకురావాలనేది న్యాయవాదులు చూసుకుంటారు. లాయర్ల కోసం ఎంత పెద్దమొత్తంలో డబ్బు ఖర్చయినా భరించేందుకు నిందితుల కుటుంబాలు సిద్ధంగా ఉంటాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఓ కేసులో అరెస్టయిన సైబర్ నేరస్థులు 40 లక్షల వరకూ ఖర్చు చేసేందుకు సిద్ధమంటూ స్థానిక న్యాయవాదిని ఆశ్రయించారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? మీరు ఎంత కష్టపడి అరెస్ట్ చేసినా తేలికగా బయటకొస్తాం. మీరూ చూసీచూడనట్టు వదిలేస్తే ఎంతైనా ఇస్తామంటూ బహిరంగంగానే చెబుతున్నట్టు సమాచారం. తాజాగా ఒక పోలీసు అధికారికి సైబర్ నేరస్థుడు కేసు లేకుండా చేస్తే 10 లక్షల రూపాయలిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. మీ దగ్గర అరెస్టయితే చాలాకాలం జైల్లో ఉండాల్సి వస్తుందని అందుకే ఈ ఆఫర్ ఇచ్చానంటూ.. చెప్పటంతో ఇన్​స్పెక్టర్​ సైతం విస్మయానికి గురైనట్టు సమాచారం.

తెలంగాణ పోలీసులు మాత్రమే..

దేశవ్యాప్తంగా సైబర్ నేరస్థులపై వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటాయి. తెలంగాణ పోలీసులు మాత్రమే ఈ నిందితులను పట్టుకుని, సొమ్ము రికవరీ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉన్న కేసులను ఒకచోటికి చేర్చుతూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Aadhar Card Crimes : ఆధార్, పాన్‌ కార్డు నంబర్లు ఎవరికైనా ఇస్తున్నారా?... అయితే జాగ్రత్త!

Last Updated : Dec 10, 2021, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details