హైదరాబాద్‌లోని ఓ వ్యాపారసంస్థకు కన్నమేశారు సైబర్ మోసగాళ్లు. పేమెంట్ గేట్ వే ద్వారా రూ.1.5 కోట్లను బదిలీ చేశారు. దీంతో మోసపోయిన కంపెనీ యజమాన్యం ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఒడిశాకు చెందిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.
cyber fraudsters arrest: వ్యాపార సంస్థ నుంచి కోటిన్నర బదిలీ.. సైబర్ మోసగాళ్ల అరెస్ట్
ఓ వ్యాపార సంస్థ నుంచి ఏకంగా రూ.1.5 కోట్లను బదిలీ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఒడిశాకు చెందిన ఐదుగురు ఈ మోసానికి పాల్పడ్డారు. నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒడిశాకు చెందిన ఐదుగురు అరెస్ట్
వ్యాపార సంస్థ నుంచి కొట్టేసిన నగదును భువనేశ్వర్‌లో బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో మూడు రోజుల క్రితం భువనేశ్వర్‌కు వెళ్లిన పోలీసులు... గోబింద చంద్ర, బిమల్ ప్రసాద్ సమంతరాయ్, బాలభద్ర దాస్, దినేష్ మహంతి, మనోజ్ కుమార్ రౌత్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బ్యాంక్ ఖాతాలు ఇస్తే కమీషన్ ఇస్తారంటూ చెబితే వాటిని ఇచ్చామంటూ వివరించడంతో నగదు స్వాహా చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- ఇవీ చూడండి:
- Cyber crime: సైబర్ నేరగాళ్ల వల.. చిక్కితే జేబు గుల్ల.!
- Loan Apps Case : నగదు బదిలీలో బ్యాంక్ అధికారుల హస్తం!
- Cyber Crime Today in Mahabubabad: ఒక్క క్లిక్‌తో.. రూ.2 లక్షలు ఖల్లాస్
- Cyber crime: మంత్రి పువ్వాడ పేరుతో నకిలీ ఈమెయిల్
- ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్.. రుణాలిస్తామని కోట్లల్లో మోసం