తెలంగాణ

telangana

ETV Bharat / crime

పోలీస్​ బాస్​నూ వదలని సైబర్ నేరస్థులు.. పలువురికి సందేశాలు - dgp mahender reddy latest news

cyber fraud: సైబర్‌ నేరస్థులు చెలరేగిపోతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ప్రముఖులకు చెందిన సామాజిక మాధ్యమాలను హ్యాక్​ చేయడం, నకిలీవి సృష్టించి డబ్బులు అడగడం వారికి పరిపాటిగా మారింది. ఈసారి మరో అడుగు ముందుకేసి ఏకంగా పోలీస్​ బాస్​ పేరిట నకిలీ ఖాతా సృష్టించారు. పలువురికి సందేశాలు పంపారు.

పోలీస్​ బాస్​నూ వదలని సైబర్ నేరస్థులు.. పలువురికి సందేశాలు
పోలీస్​ బాస్​నూ వదలని సైబర్ నేరస్థులు.. పలువురికి సందేశాలు

By

Published : Jun 27, 2022, 4:09 PM IST

cyber fraud: సైబర్ నేరగాళ్లు పోలీస్​ బాస్​నూ వదల్లేదు. ఓ మొబైల్ నెంబర్​కు డీజీపీ మహేందర్​రెడ్డి ఫొటో పెట్టిన కేటుగాళ్లు.. పలువురు పోలీస్ అధికారులతో పాటు.. ఇతరులకు సందేశాలు పంపించారు. స్వచ్ఛంద సంస్థ పేరుతో సందేశాలు పంపిన నేరగాళ్లు.. ఆ లింకును తెరచి వివరాలు నమోదు చేయాల్సిందిగా కోరారు. అప్రమత్తమైన డీజీపీ అది తన నెంబర్ కాదని.. ఎవరూ స్పందించొద్దని తెలిపారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారుల రహస్య వివరాలు తెలుసుకోవడానికి ఇలాంటి సందేశాలు పంపిస్తున్నారని.. ఆ ఉచ్చులో పడొద్దని సూచించారు.

హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సదరు నెంబర్​ను వెంటనే బ్లాక్ చేయించారు. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి.. నైజీరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ నెంబర్​ తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ ఖాతాలు, వాట్సాప్​ డీపీలు, గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని పోలీసులు సూచించారు. గతంలోనూ పలువురు పోలీస్​ ఉన్నతాధికారులు, అదనపు డీజీ స్వాతి లక్రా, ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ రంగనాథ్ పేరిట నకిలీ ఫేస్​బుక్ ఖాతాలు తెరిచిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details