తెలంగాణ

telangana

ETV Bharat / crime

5 రూపాయల నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంటే.. లక్షలు ఇస్తామంటూ..

ఎన్ని సైబర్​ మోసాలు జరిగినా ప్రజలు జాగృతం కావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట సైబర్​ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో ఓ వ్యక్తి వద్ద రూ.8.34 లక్షలు కాజేశారు సైబర్‌ నేరస్థులు.

cyber crime
సైబర్​ మోసం

By

Published : Apr 24, 2021, 11:26 AM IST

Updated : Apr 24, 2021, 3:40 PM IST

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కస్తూరి నరసింహులు అనే రైతు 20 రోజుల క్రితం యూట్యూబ్​లో ఐదు రూపాయల నోటు మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అనే వీడియో చూశాడు. అది చూసిన సెకన్లలోనే సంబంధిత వ్యక్తులు నరసింహులుకు ఫోన్ చేశారు. మీదగ్గర ట్రాక్టర్ బొమ్మ ఉన్న నోటు ఉందా అని అడగగానే ఉందని చెప్పడంతో మీకు 11.74 లక్షలు వస్తాయి అని చెప్పారు. ఒక్కసారి మీ వద్ద ఉన్న 5 రూపాయల నోటును ఫొటో తీసి వాట్సాప్​లో పెట్టుమంటే సదరు వ్యక్తి ఫోన్ నంబర్​కు పంపాడు. కొంత సమయం తర్వాత సదరు వ్యక్తి ఫోన్ చేసి వావ్ 11.74 లక్షలు మీ సొంతం అని ఫోన్ చేశాడు.

ఇదీ నిజమని నమ్మిన బాధితుడు డబ్బులు వస్తే ముగ్గురు కూతుళ్ల ఉన్నత చదువులకు ఉపయోగపడతాయని ఆనందపడ్డాడు. మళ్లీ సదరు వ్యక్తి ఫోన్ చేసి మీ డబ్బు మీకు చేరాలంటే దానికోసం మీరు ఒక అకౌంట్ తీయాల్సి ఉంటుంది. దానికి డబ్బులు ఖర్చవుతాయి అని మొదటగా లక్ష రూపాయలు అకౌంట్​లో వేయించుకున్నారు. ఆ తర్వాత ఎన్​ఓసీ, ఐటీ అంటూ 20 రోజుల వ్యవధిలోనే మొత్తం 8.35 లక్షలు వారికి అకౌంట్​లో డబ్బులు జమ చేశాడు.

చివరగా జీఎస్టీ కోసం 2.74 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పగా.. మొదటి విడతగా 1.35 లక్షల డబ్బులు తీసుకుని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లాడు. అనుమానం వచ్చిన సిబ్బంది నరసింహులును మేనేజర్ వద్దకు పంపించగా ఇంత పెద్ద అమౌంట్ జీఎస్టీ కోసం కట్టిన సందర్భాలు ఇప్పటివరకు లేవు... ఇదేదో మోసం ఉన్నట్టుంది అని నరిసంహులుకు చెప్పాగా అతను దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసగాళ్లు చేసిన ఫోన్ నంబర్ పశ్చిమ బెంగాల్​కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Last Updated : Apr 24, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details