తెలంగాణ

telangana

ETV Bharat / crime

CYBER CRIME: పీఎఫ్​ పేరుతో రూ.9 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు - రూ.9లక్షల మోసం

ప్రభుత్వ విశ్రాంత మహిళా ఉద్యోగినిని పీఎఫ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బురిడీ కొట్టించారు. మీకు రావలసిన పీఎఫ్ డబ్బులు బ్యాంకులో జమ చేస్తామని నాలుగు విడతలుగా మొత్తం తొమ్మిది లక్షలు కాజేశారు.

Cyber criminals trapped  ex govt employee
పీఎఫ్ పేరుతో సైబర్ మోసం

By

Published : Aug 8, 2021, 5:01 AM IST

Updated : Aug 8, 2021, 6:32 AM IST

ప్రభుత్వ విశ్రాంత మహిళా ఉద్యోగినిని.. పీఎఫ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ప్రావిడెంట్ ఫండ్‌(పీఎఫ్‌) కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నామని ఆమెను నమ్మించారు. మీకు రావాల్సిన పీఎఫ్‌ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, అందుకోసం ట్యాక్స్‌ ముందుగానే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని చెప్పి బ్యాంక్‌ డెబిట్‌ కార్డు, సీవీవీ నంబరు తీసుకున్నారు.

ఆమె ఫోన్‌కి వచ్చిన ఓటీపీ నెంబర్లు కూడా తీసుకుని నాలుగు విడతలుగా మొత్తం రూ.9లక్షలు కాజేశారు. ఆ తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ అని రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను అశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: Cyber Crime: అధిక లాభం పొందొచ్చని సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ

Last Updated : Aug 8, 2021, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details