హైదరాబాద్ హిమాయత్ నగర్లోని మణప్పురం గోల్డ్ సంస్థకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ముందుగా సంస్థ ఉన్నతాధికారినంటూ కేటుగాళ్లు... బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేశారు. వారి నుంచి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని ముప్పై లక్షలు కాజేశారు.
Cyber crime: మణప్పురం గోల్డ్ సంస్థకు రూ.30 లక్షలు టోకరా
మణప్పురం గోల్డ్ సంస్థకు... సైబర్ నేరస్థులు 30 లక్షలు టోకరా వేశారు. సంస్థ ఉన్నతాధికారినంటూ.... హైదరాబాద్ హిమాయత్ నగర్ బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేశారు. వారి నుంచి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని ముప్పై లక్షలు కాజేశారు.
Cyber crime, crime in Manappuram Gold Company, Hyderabad, theft
ఇద్దరు ఉద్యోగులను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..... వారి ఐడీల నుంచి లాగిన్ అయ్యి రూ.15 లక్షల చొప్పున కాజేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మణప్పురం సంస్థ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మార్షల్ ఆర్ట్స్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం- 18మంది మృతి