తెలంగాణ

telangana

ETV Bharat / crime

Aadhar Card Crimes : ఆధార్, పాన్‌ కార్డు నంబర్లు ఎవరికైనా ఇస్తున్నారా?... అయితే జాగ్రత్త! - తెలంగాణ వార్తలు

CYBER CRIME : అతడిది ఒక చిన్న దుకాణం.. కానీ, 26 లక్షల పన్ను కట్టాలని నోటీసు వచ్చింది. ఆమె ఇప్పటివరకు ఎలాంటి రుణం తీసుకోలేదు.. కానీ, ఏకంగా 8 లోన్లు ఉన్నాయని తేలింది. ఇది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా! మీకు తెలియకుండానే.. మీ ఆధార్‌, పాన్‌కార్డులతో రుణాలు తీసుకుని సైబర్‌ నేరస్థులు మోసాలు చేస్తున్నారు. నిన్నటివరకు ఖాతాల్లోని సొమ్మును మాయం చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు గుర్తింపు కార్డుల క్లోనింగ్‌ ద్వారా కోట్లు కొళ్లగొడుతున్నారు.

CYBER CRIME
CYBER CRIME

By

Published : Dec 10, 2021, 5:36 AM IST

Updated : Dec 10, 2021, 6:28 AM IST

సైబర్‌ నేరస్థుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యక్తిగత రుణాలిప్పిస్తామంటూ అంతర్జాలంలో ప్రచారం చేసి.. ఆధార్, పాన్‌కార్డుల వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని క్లోనింగ్‌ చేస్తున్నారు. సిబిల్‌ స్కోర్‌ సరిచూసుకుని కార్డులపై వారి ఫొటోలను అతికించి రుణాలు తీసుకుంటున్నారు. జీఎస్​టీ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ తీసుకుని దిల్లీ, ముంబయి, గోవా, బెంగుళూరులో కంపెనీలు సృష్టిస్తున్నారు. చిరునామా బాధితులదే ఉంచుతున్నారు. బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమకాగానే విత్‌డ్రా చేసుకుని మూసేస్తున్నారు.

ఆధార్, పాన్‌ కార్డు నంబర్లు ఎవరికైనా ఇస్తున్నారా?... అయితే జాగ్రత్త!

జీఎస్​టీ కార్యాలయం నుంచి నోటీస్​..

హైదరాబాద్‌లో వెలుగుచూసిన వరుస ఘటనలు ఇందుకు అద్ధం పడుతున్నాయి. యాకుత్‌పురాకు చెందిన అబ్దుల్‌.. చిన్న ఎలక్ట్రికల్‌ షాపు నడుపుతున్నారు. ఆయనకు కేంద్ర జీఎస్​టీ కార్యాలయం నుంచి 26 లక్షలు జీఎస్​టీ చెల్లించాలని నోటీసు ఇచ్చారు. చిన్నపాటి వ్యాపారం చేస్తున్న అబ్దుల్‌ .. ఆ నోటీసు చూసి ఆశ్చర్యపోయారు. బషీర్‌బాగ్‌లోని జీఎస్​టీ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించారు. అబ్దుల్‌ పేరుమీద కంపెనీలున్నాయని.. కోట్లలో టర్నోవర్‌ చూపించారని అధికారులు చెప్పారు. కంగుతిన్న అబ్దుల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుర్వినియోగమవుతున్న పాన్‌ కార్డ్​..

సికింద్రాబాద్‌లో ఉంటున్న మాలతి పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వ్యక్తిగత రుణం కోసం ఇంటి సమీపంలోని ఎస్​బీఐకి వెళ్లారు. వివరాలు చెప్పి రుణం కావాలని అభ్యర్థించారు. కొన్ని కారణాల వల్ల రుణం ఇవ్వలేమంటూ అధికారులు తెలిపారు. అనంతరం ఆమె పనిచేస్తున్న స్టేషన్‌ సమీపంలోని బ్యాంక్‌కు వెళ్లి అడిగారు. మాలతి పాన్‌ కార్డు పరిశీలించిన అధికారులు.. ఇప్పటికే 8 సార్లు రుణాలు తీసుకున్నారని వివరించారు.

ముంబయి, దిల్లీ కేంద్రాలుగా వ్యవహారం..

మధురానగర్‌కు చెందిన ఓ వ్యక్తి పేరుమీద సైబర్‌ నేరస్థులు నాలుగు ఫైనాన్స్‌ సంస్థల నుంచి 6 లక్షల రుణం పొందారు. ద్విచక్రవాహనం కొనేందుకు వెళ్లిన బాధితుడికి అసలు విషయం తెలిసింది. పాన్‌కార్డులు దుర్వినియోగమవుతున్నాయనే విషయం చాలామందికి తెలీదని పోలీసులు తెలిపారు. ముంబయి, దిల్లీ కేంద్రాలుగా వ్యవహారం నడిపిస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

"ఎవరైనా ఆధార్, పాన్‌కార్డుల వివరాలు అడుగుతే జాగ్రత్తగా ఉండండి. వాటి వివరాలు ఎవరికీ ఇవ్వొద్దు. వాటిని సైబర్​ నేరగాళ్లు ఏదో ఒక విధంగా దుర్వినియోగం చేసే ప్రమాదముంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి."

- ప్రసాద్​, ఏసీపీ, సైబర్​ క్రైమ్​

ఇవీ చదవండి :

Cyber crime: మంత్రి పువ్వాడ పేరుతో నకిలీ ఈమెయిల్

CYBER CRIME: పోలీసులకు పెనుసవాల్​గా సైబర్​ నేరాలు

Last Updated : Dec 10, 2021, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details