కళ్లముందు కనికట్టు చూపించి రూ. 1.45 లక్షలు మోసం చేశారు సైబర్ నేరగాళ్లు (Cyber crime). హైదరాబాద్ జీడిమెట్ల పరిధి అపురూప కాలనీకి చెందిన జగదీశ్వర్ రావు 'టీనా ప్రైమ్ డే' అనే యాప్‌లో పలు దఫాలుగా రూ. 1.45 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆ యాప్‌లో వాళ్లు ఒక్కొక్క టాస్క్ ఇచ్చారు. రావు గారు ఇచ్చిన టాస్క్‌లన్నీ పూర్తి చేశాడు. దాని ప్రతిఫలంగా పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభం, మూడింతల లాభం చూపించింది.
అప్పుడు తెలిసింది..
ఇక ఇప్పటికి సంపాదించిన డబ్బు చాలు అనుకున్నాడు. కష్టపడి సంపాదించిన డబ్బు విత్‌డ్రా చేసుకుందాం అనుకున్నాడు. డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించగా.. ఆ డబ్బు హోల్డ్‌లో ఉన్నట్లు చూపించింది. 'టీనా ప్రైమ్ డే' వారికి ఫోన్ చేసి అడగ్గా.. కొంత నగదును పంపిస్తే రిలీజ్ చేస్తామని మాయమాటలు చెప్పి... మళ్లీ ఫోన్ చేస్తే స్పందించలేదు. చివరాకరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు.. జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.