సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలు చెప్పి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లు సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులను సైతం తమ సైబర్ ఉచ్చులో బిగిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాకు చెందిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా( fake Facebook create on Kukatpally MLA) తెరిచారు. ఇతరులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి డబ్బులు కావాలని కోరుతున్నారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు.
Cyber crime: ప్రజాప్రతినిధులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు... - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
MLA Facebook account hacked: ఇన్నాళ్లు సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులను సైతం తమ సైబర్ ఉచ్చులో బిగిస్తున్నారు. తాజాగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి డబ్బులు కావాలని కోరుతున్నారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు.
Kukatpally MLA
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు(Kukatpally MLA complaint against cyber criminals) చేపట్టారు. సైబర్ నేరగాళ్లు ఎక్కడెక్కడో ఉంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మాధవరం కృష్ణారావు అన్నారు. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేస్‌బుక్ ఖాతాలు హ్యాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:Azadi ka amrit mahotsav: వేలాది మహిళలను పడుపు వృత్తిలోకి నెట్టి..
Last Updated : Nov 25, 2021, 12:17 PM IST