తెలంగాణ

telangana

ETV Bharat / crime

పోలీసుల ఖాతా హ్యాక్​.. డబ్బులు పంపాలని సందేశాలు

సాధారణంగా సామాన్య ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం వారిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు సంబంధించిన... సామాజిక మాధ్యమాల ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. వాటి ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ... పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు.

Cyber criminals hacked the police Facebook account in warangal rural district, Cyber criminals hacked the police Facebook account
పోలీసుల ఖాతాను హ్యాక్​ చేసిన సైబర్​ నేరగాళ్లు, వరంగల్​ గ్రామీణ జిల్లాలో పోలీసుల ఫేస్​బుక్​ ఖాతా హ్యాక్​

By

Published : Mar 29, 2021, 8:19 PM IST

ప్రస్తుతం పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రతి పోలీస్​ స్టేషన్​కు సంబంధించిన వివరాలతో పోలీసులు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను తెరుస్తున్నారు. వీటి ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను సైబర్ నేరగాళ్లు అదునుగా తీసుకుంటూ ఆ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు.

వరంగల్ రూరల్ జిల్లా దామెర పోలీస్ స్టేషన్​కు సంబంధించి కొంత కాలం కిందట 'ఎస్​హెచ్​ఓ దామెర' పేరుతో ఫేస్​బుక్​ ఖాతాను పోలీసులు తెరిచారు. దాన్ని సైబర్​ నేరగాళ్లు హ్యాక్​ చేసి ఆదివారం రాత్రి పలువురు వ్యక్తులను డబ్బులు అడిగారు. గూగుల్ పే, ఫోన్ పే లాంటి వాటి ద్వారా పంపాలంటూ సందేశాలు పంపారు. వారు మోసగాళ్లని గ్రహించిన కొంతమంది ఆ విషయాన్ని దామెర పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసింది నిజమేనని... పోలీసులు తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా ఇటువంటి వాటిని నమ్మి మోసపోకూడదన్నారు. పోలీసులు డబ్బులు అడగరని, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

పోలీసుల ఖాతాను హ్యాక్​ చేసిన సైబర్​ నేరగాళ్లు, వరంగల్​ గ్రామీణ జిల్లాలో పోలీసుల ఫేస్​బుక్​ ఖాతా హ్యాక్​

ఇదీ చదవండి: వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details