క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందవచ్చని నమ్మించి సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రూ. 9.35 లక్షలు కాజేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర నగర్‌కు చెందిన రాకేశ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్‌లో బిట్ కాయిన్ ట్రేడింగ్ గ్రూప్ లిమిటెడ్ అంటూ మెసేజ్ చేశారు. ముందుగా రాకేశ్ రూ.10వేలు పెట్టుబడి పెట్టగా అధిక లాభంతో తిరిగి తన బిట్ కాయిన్ రూపంలో బదిలీ చేశారు.
అప్పటికీ రాకేశ్ నమ్మకపోవడంతో వారు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో కొందరు వ్యక్తులు తాము గత మూడు నెలలుగా అధిక లాభం పొందుతున్నామని రాకేశ్‌ను నమ్మించారు. ఈ మాటలను నమ్మిన రాకేశ్... ఒకేసారి రూ.9.35 లక్షల నగదును బదిలీ చేయగా ఎలాంటి స్పందన లేదు. పంపిన నగదు ఫ్రీజ్ అయిందని... అది రిలీజ్ చేయాలంటే మరికొంత పంపాలనడంతో బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.