తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Crime: కిలో బాదం రూ.300, జీడిపప్పు రూ.500..! - డ్రై ఫ్రూట్స్​ పేరుతో మోసం

సైబర్​ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్​ నేరగాళ్లు(Cybercriminals) రోజుకో కొత్త పంథాను అనుసరిస్తున్నారు. గతంలో ప్రముఖుల నకిలీ ఫేస్​బుక్​ ఖాతాలు క్రియేట్​ చేసి వారి సన్నిహితుల నుంచి మనీ(cyber crime) దోచుకున్నారు. అంతకు ముందు పలువురికి ఫోన్లు చేసి కేవైసీ అప్​డేట్​ పేరుతో చీట్​ చేసి సొమ్ము కాజేశారు. తాజాగా ఎండు ఫలాలు(dry fruits) తక్కువ ధరలకే అమ్ముతామంటూ చీట్​ చేస్తున్నారు.

cyber crime new vein
cyber crime: కొత్త పంథాలో సైబర్​ నేరగాళ్ల మోసం

By

Published : Jun 20, 2021, 9:51 AM IST

కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని కూడా సైబర్‌ నేరగాళ్లు(Cybercriminals) వదలడం లేదు. అత్యవసర ఔషధాలు మొదలుకుని ఎండు ఫలాలు(dry fruits) తక్కువ ధరలకే విక్రయిస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తూ... ముందుగా డబ్బు చెల్లిస్తే ఇంటికి తీసుకువచ్చి ఇస్తామంటూ యథేచ్ఛగా మోసాలకు(cyber crime) పాల్పడుతున్నారు. ఇటీవల మోసపోయిన బాధితులు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

తక్కువ ధరలకే జీడిపప్పు, బాదం

కరోనా వైరస్‌ సోకిన వారు మంచి పౌష్టికాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో దశ కొవిడ్‌ విజృంభణతో ఎండు ఫలాల(dry fruits)కు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు(Cybercriminals) రంగప్రవేశం చేశారు. తక్కువ ధరలకే జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌, ఖర్జూరం, తృణ ధాన్యాలు, పిస్తా వంటివి... అందిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో(Social media) ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తున్నారు. నేరుగా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామంటూ... అయితే తాము సూచించిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెబుతున్నారు.

అయిదు వేల నుంచి..

నేరగాళ్ల మాటలు నమ్మి కొందరు డబ్బలు జమ చేస్తున్నారు. ఖాతాల్లోకి డబ్బు రాగానే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు తరచూ సైబర్‌ క్రైం పోలీసులకు వస్తున్నాయి. అయితే కొందరు అయిదు వేల నుంచి మొదలుకుని రెండు వేలు, వెయ్యి రూపాయలు ఇలా నేరగాళ్లు స్వాహా చేస్తున్నారు. బాధితులు కొందరు తక్కువ మొత్తం పోయిందని ఫిర్యాదులు ఇవ్వడం లేదు. మరికొందరు మాత్రం ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నారు.

ఆ కేటుగాళ్లే

ఓఎల్ఎక్స్, ఫేస్​బుక్ వేదికలుగా రోజుకో తరహాలో మోసాలు చేస్తున్న భరత్​పూర్ సైబర్ కేటుగాళ్లే (Cybercriminals) ఈ మోసాలు చేస్తున్నారంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఫేస్​బుక్ మార్కెట్ ఫ్లేస్​లో ప్రకటనలు పోస్ట్ చేస్తున్న వారిలో 95 శాతం వీరే ఉంటారని అంచానా వేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్లకు దీటుగా మెల్టింగ్ హార్ట్స్ పేరుతో విభిన్నమైన ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు.

ఫేస్​బుక్ ఫేక్​ యాడ్స్​

ఫేస్​బుక్ ద్వారా వీరిని పట్టుకునేందుకు వీలుగా 99 శాతం తప్పుడు పేర్లుంటాయని పేర్కొన్నారు. తప్పుడు ప్రకటనల్లో వ్యాక్యాలు, సైబర్ నేరస్థుల భావ వ్యక్తీకరణ కారణంగా భరత్ పూర్ ముఠాలే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతేడాది సంపూర్ణ లాక్​డౌన్ అమల్లో ఉన్నప్పుడు ఇంటికే మద్యం పంపిణీ చేస్తామంటూ... ప్రముఖ మద్యం దుకాణాల పేర్లతో ఫేస్​బుక్​లో ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మోసం నుంచి తప్పించుకోవాలంటే హోమ్ డెలివరీ ఇచ్చేటప్పుడే మొత్తం నగదు ఇస్తామంటూ నిందితులకు చెప్పాలని సూచించారు.

ఇదీ చూడండి:METRO: ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి మెట్రో రైలు సేవలు

ABOUT THE AUTHOR

...view details