సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. అధిక లాభాలు వస్తాయనే ఆశతో అమీర్ పేట ఎస్.ఆర్.నగర్‌కు చెందిన సీహెచ్ సురేశ్ ఆన్లైన్ యాప్‌లో రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అది ఫేక్ యాప్ కావటంతో లాభాలు కాదు కదా... అసలు డబ్బులు పోయాయి.
సైబర్ నేరగాళ్లు టోకరా.. రూ. 7లక్షలు మాయం - cyber crime news in hyderabad
మా యాప్‌లో పెట్టుబడులు పెట్టండి.. తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలొస్తాయంటూ సైబర్ మోసగాళ్లు తెలివిగా వల విసురుతూ... అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ బిజినెస్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి దగ్గర నుంచి రూ. 7లక్షలు కాజేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అధిక లాభాల పేరుతో సైబర్ నేరగాళ్లు టోకరా.. రూ. 7లక్షలు మాయం
మోసపోయానని గమనించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:చోరీ కేసులో జైలుకెళ్లింది.. తిరిగొచ్చి పెళ్లాడమంది..